రేగొండ, ఏప్రిల్ 15 : జయశంకర్ జిల్లా గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన బుల్లవేణి రాజయ్య(59) అనే రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. జగ్గయ్యపేట గ్రామానికి చెందిన రాజయ్య వేసిన పంటలు ఎండిపోయి సరైన గిట్టుబాటు ధర లేక అప్పులు పెరిగిపోయాయి. దీంతో అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మనోవేదనతో ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడవ్కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.