నర్సంపేట, డిసెంబర్ 13: రాష్ట్రంలోని రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే టీఆర్ఎస్ సర్కారు ప్రధాన ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన శాంతిసేన రైతు సహకార పరపతి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న రైతు పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు బాగుపడితేనే మనమంతా బాగుంటామని సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంట్, పంట రుణమాఫీ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు.
కార్యక్రమంలో అధ్యక్షుడు చిలువేరు కుమారస్వామి, గౌరవ అధ్యక్షుడు ఎర్ర జగన్మోహన్రెడ్డి, చిలువేరు వెంకటేశ్వర్లు, బుర్ర మోహన్‌రెడ్డి, చిలువేరు కొమ్మాలు, కొమురయ్య, రేమిడి శ్రీనివాస్‌రెడ్డి, చింతల సాంబరెడ్డి, పుల్లూరి చిన్న రవిగౌడ్, తౌటి వెంకటనారాయణ, గంగాడి తిరుపతిరెడ్డి, గంగాడి రాజమల్లారెడ్డి, రాదారపు రాజయ్య, తూముగంటి చక్రపాణి, ఈగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి
నెక్కొండ: ఆధ్యాత్మిక మార్గంలో పయనించి మానవ జన్మకు సార్థకత చేకూర్చుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుండ్రపల్లిలో గణపతి, నాగేంద్ర సుబ్రహ్మణ్యస్వామి, సంతాన నాగేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయన మాట్లాడారు. ఆధ్మాత్మిక కార్యక్రమాలు అన్నివర్గాలను ఐక్యం చేసి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేసేలా ఉపకరిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వల్లెం కృష్ణారెడ్డి, గణపతి ఆలయ నిర్మాణ దాత మనుబోతు పూర్ణచంద్రారెడ్డి, నాగేంద్రస్వామి ఆలయ నిర్మాణ దాత తాటిపర్లి హనుమారెడ్డి, సంతాన నాగేంద్రస్వామి దాత మువ్వ పిచ్చిరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు బోళ్ల ఆనందయ్య, మందటి మంగారావు, ఎంపీపీ జాటోత్ రమేశ్, సర్పంచ్ బోంపెల్లి రాజేశ్వర్‌రావు, సొసైటీ చైర్మన్ మారం రాము, మాజీ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షుడు బక్కి అశోక్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి మదన్మోహన్రావు తదితరులు వేర్వేరుగా పాల్గొన్నారు. సోమవారం ఉత్సవాలు ముగిశాయి.
బాధిత కుటుంబాలకు పరామర్శ
నర్సంపేట/నర్సంపేట రూరల్: నర్సంపేటలో రిటైర్డ్ ఉద్యోగి రుద్ర బుచ్చయ్య మృతిపై ఎమ్మెల్యే పెద్ది సంతాపం ప్రకటించారు. ఆయన వెంట కౌన్సిలర్ రుద్ర మల్లీశ్వరీ ఓంప్రకాశ్, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్ ఉన్నారు. మండలంలోని చంద్రయ్యపల్లిలో మాజీ సొసైటీ డైరెక్టర్ కంకణాల ఎల్లారెడ్డి తండ్రి ఐన కంకణాల వీరారెడ్డి మృతి చెందగా, బాధి కుటుంబాన్ని పెద్ది పరామర్శించారు. ఆయన వెంట జడ్పీటీసీ కోమాండ్ల విజయ, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ బరిగెల లావణ్య, పార్టీ గ్రామ అధ్యక్షుడు జర్పుల వీరన్న, నాయకులు ఉన్నారు.