జిల్లాలోని కాటారం, మహాముత్తారం మండలాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలతో పాటు గ్లైఫోసెట్ కలుపు మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహాముత్తారం ఎస్సై మహేందర్ కుమార్, సిబ్బంది, మండల వ్యవసాయ అధికారి అనూష రెండు మండలాల్లో దాడులు చేసి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం ఘనీపూడి గ్రామానికి చెందిన అచ్చ హనుమంత రావు, కాటారానికి చెందిన లావణ్య ఎరువుల దుకాణం వ్యాపారి బొమ్మ సమ్మిరెడ్డి, మల్హర్ మండలం పాత రుద్రారానికి చెందిన జాడి సమ్మయ్య, మహాముత్తారం మండలం నల్లగొండ, మీనాజీపేట గ్రామాలకు చెందిన చీర్ల సతీశ్, బుచ్చిరెడ్డి, కాటారం గ్రామానికి చెందిన బొమ్మన వెంకటస్వామి, కందుల కోటేశ్వర్రావు, సుబ్బయ్య వద్ద నుంచి రూ. 5 లక్షల విలువ చేసే 202 కిలోల పత్తి విత్తనాలు, 300 లీటర్ల నిషేధిత ైగ్లెఫోసెట్ కలుపు మందును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.