వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కక్షా రాజకీయం ఊపందుకున్నది. మాట వినని నాయకులను ఓ వర్గం పోలీస్ కేసులతో టార్గెట్ చేస్తున్నది. నయానో భయానో దారికి తెచ్చుకునేందుకు పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నది. స్వపక్ష నాయకులపైనే కేసులు పెట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ కార్పొరేటర్ గుండే టి నరేందర్‌పై పోలీసులు కేసులు పెట్టడం కలకలం సృష్టించింది. కార్పొరేటర్ స్థాయి నాయకుడిపైనే కేసులు పెట్టి వేధిస్తుంటే కిందిస్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటని జోరుగా చర్చ జరుగుతు న్నది. ఈ వ్యవహారంపై సీనియర్ నాయకులు సైతం పెదవి విప్పకపోవడం ఓ వర్గం పెత్తనం ఏ స్థాయిలో ఉన్నదో అవగతమవుతున్నది. – వరంగల్, మే 19
మాట వినని నాయకులను కాంగ్రెస్‌లోని ఓ వర్గం వేధిస్తున్నది. పోలీస్ కేసులతో టార్గెట్ చేస్తున్నది. సొంత శిబిరం నుంచి ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లిన కార్పొరేటర్ గుండేటి నరేందర్‌ను టార్గెట్ చేసి లైంగిక దాడికి యత్నం కేసుతో పాటుగా అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో పోలీస్ కేసుల భయం పట్టుకుంది. ఏ రోజు ఎవరిని టార్గెట్ చేస్తారోనన్న ఆందోళన నెలకొంది. పార్టీలో వన్ మ్యాన్ షో జరుగుతుందని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. తమను రక్షించే వారెవరంటూ ఆవేదన చెందుతున్నారు. తూర్పు కాంగ్రెస్‌లో సరికొత్త సంస్కృతితో పాతతరం నాయకులు ఇమడలేక పోతున్నారు.
నరేందర్ కేసు మామునూరు ఏసీపీకి అప్పగింత
కార్పొరేటర్ గుండేటి నరేందర్ కేసు విచారణ బాధ్యతలను మామునూరు ఏసీపీ తిరుపతికి అప్పగించారు. కేసు విచారణను వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ నుంచి తప్పించడం చర్చనీ యాంశంగా మారింది. తూ ర్పు కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి నందిరాంనాయక్ కొ మ్ము కాస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలోనే కేసును ఆయన నుంచి తప్పించినట్లు చర్చ సాగుతున్నది. ఏసీపీ తిరుపతి కేసు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫిర్యాదు చేసి న నమిండ్ల లావణ్యను మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో విచారించారు. కాగా, అధికార పార్టీ కార్పొరేటర్‌పై మహి ళ 100కు ఫిర్యాదు చేయడం, వెంటవెంటనే అదుపులో కి తీసుకోవడం, కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించిన తీరు పలు అనుమానాలకు తావిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.
పరామర్శల వెల్లువ
కార్పొరేటర్ గుండేటి నరేందర్‌కు పరామర్శలు వెల్లువెత్తాయి. అన్యాయంగా అక్రమ కేసులు నమో దు చేశారని పార్టీలకతీతంగా సానుభూతి వ్యక్తమవుతున్నది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నరేందర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామని, భయపడాల్సింది ఏమీ లేదని అభయమిచ్చా రు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, పద్మశాలి కుల సంఘం నాయకులు ఆయనను పరామర్శించారు.