జనగామ, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీపై వ్యాపారులు నిరాసక్తి చూపుతున్నారు. గతంలో ఉన్న రూ.2లక్షల ఫీజుకు 50 శాతం అదనపు భారం వేయడంతో టెండర్లకు వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డా రు. కొత్తగా దరఖాస్తు చేయాలనుకునేవారు నిరుత్సాహానికి గురవుతున్నారు. జనాభా ప్రాతిపదికన మద్యం షాపులకు ఎక్సైజ్ పన్ను చెల్లించాల్సి ఉం టుంది. 5 వేల జనాభా ఉన్న గ్రామాలకు రూ.50 లక్షలు, 5వేల నుంచి 50 వేల వరకు రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల వరకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో రూ.1.1కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
2025-27 రెండేళ్ల కాలపరిమితి వరకు 6 సమాన వాయిదాల్లో ఈ పన్ను కట్టాలి. కాగా, 2023-25 కాలంలో ఉన్న లైసెన్స్ నిబంధనలే ఈసారి కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం దుకాణాల లైసెన్స్ కాలపరిమితి నవంబర్ 30 వరకు ఉండగా, ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు దసరా నాటికి టెండర్లకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించే అవకాశమున్నది. నూతన మద్యం పాలసీలో లైసెన్స్ అప్లికేషన్ కోసం చెల్లించే మొత్తాన్ని తిరిగి చెల్లించని (నాన్ రిఫండబుల్) ఫీజు గతంలో రూ.2లక్షలు ఉంటే ఈసారి రూ.3లక్షలకు పెంచాలని, కాలపరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల పాటు అమమలులో ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. షాపుల కేటాయింపులు కలెక్టర్ల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.
జనగామ జిల్లాలో 47 మద్యం షాపులుంటే రిజర్వేషన్ల ప్రకారం గౌడ కులస్తులకు-13 (15శాతం), ఎస్సీలకు-5 (10శాతం), ఎస్టీలకు-1 (5శాతం), జనరల్ కేటగిరీలో-28 ఇవ్వాలని నిర్ణయించింది. గత టెండర్లలో 2,356 మంది పాల్గొనగా, ఎక్సైజ్ శాఖకు రూ. 47.12కోట్ల నాన్ రిఫండబుల్ ఆదాయం సమకూరింది. కానీ, పెట్టుబడికి తగినట్లు వ్యాపారం లేకపోవడంతో చాలాచోట్ల దుకాణాలను అమ్మడానికి వ్యాపారులు సిద్ధపడగా కొనేవారు లేక నష్టాలను చవిచూస్తున్నారు. జి ల్లాలో నెలకు రూ.20కోట్ల మద్యం అమ్మకాలు జరుగతుండగా, టెండర్ల గడువు పూర్తయ్యే నాటికి మొ త్తం రూ.500 కోట్ల వ్యాపారం జరుగనున్నది. నూత న మద్యం పాలసీ విధి విధానాలన్నీ పాతవే కొనసాగిస్తూ టెండర్ దరఖాస్తు సహా ఇతరాత్రా ఫీజులు మాత్రం భారీగా పెంచి ముక్కుపిండి వసూళ్లు చేయాలనే విధంగా ప్రభుత్వ నిర్ణయంపై మద్యం వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.