Satyavathi Rathod | మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా కల్పిస్తామని మరో మారు సీఎం రేవంత్ రెడ్డి బీసీ ప్రజానీకాన్ని మోసం చేయడం జరుగుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ గర్జన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సత్యవతి రాథోడ్ ప్రసంగించారు.
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పట్నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని అనేకసార్లు మాయ మాటలు చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. మళ్లీ క్యాబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీసీలను భ్రమలో పడేసి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలలో యువత ముఖ్యపాత్ర వహించాలని గ్రామాలలో, తండాలలో యువత ఓటర్లను చైతన్యం చేయాలని సూచించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల వల్ల గ్రామాలు నిరుపేద ప్రజలు అభివృద్ధి చెందారని ఆ సంక్షేమ కార్యక్రమాలను తండాలలో యువత విస్తృతంగా ప్రచారం చేసి సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయిని రంజిత్, నునావత్ అశోక్ నాయక్, మురళీధర్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.