రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకకు సర్వం సిద్ధమైంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాల్లో ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనాలతో పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. అలాగే ఉదయం 9గంటలకు ఎక్కడికక్కడ కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిషరించనుండగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.