xహనుమకొండ చౌరస్తా : కాకతీయ విశ్వవిద్యాలయ ( Kakatiya University ) పురోగతిలో బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి (VC Pratap Reddy ) అన్నారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగులు వీసీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో అడుగిడుతున్న విశ్వవిద్యాలయ కీర్తి, ప్రతిష్టలను మరింతగా పెంచేదిశగా ప్రతి ఒక్కరూ ముందు వరుసలో నిలిచి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి వీసీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పుష్పగుచ్ఛాలను స్వీకరించారు.