దేవరుప్పుల, జూన్ 23: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వీస్తున్న వ్యతిరేక పవనాలతోనే స్థ్ధానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి లో కార్యకర్తలు, నాయకు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ స్థ్ధానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే అనేక సర్వేలు చేయించుకోగా ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలిందన్నా రు. అందుకే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటే సీఎం రేవంత్‌రెడ్డి జంకుతున్నాడని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు.
అతి తక్కువ సమయంలో పాలనలో విఫలమైంది రేవంత్‌రెడ్డి ప్రభుత్వమేనని చెప్పారు. అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలిచ్చి, సామాన్యులకు అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారన్నారు. వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టికి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నార ని విమర్శించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ పేర కమిషన్లు వేసి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు జైలుకు పోతారని తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు.
అవన్నీ ఉత్తకేసులేనని ఇప్పటికే తేలిపోయిందన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు కాక అన్ని వ ర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, తెలంగాణ ఆదాయం సగానికి సగం తగ్గి రాష్ట్రం దివాలా దిశకు వచ్చిందని స్వయాన సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని చెప్పారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు స్థ్ధానిక సంస్థల ఎన్నిల్లో కర్రుకాల్చి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, దీం తో అదిగో పులి వచ్చే చందంగా త్వరలో స్థ్ధానిక సం స్థల ఎన్నికలంటూ మంత్రులు ప్రకటనలు చేసి నాలి క కరుచుకుంటున్నారని, పీసీసీ తో చీవాట్లు తింటున్నారని ఎర్రబెల్లి అన్నారు.
పాలకుర్తి నియోజకవర్గం లో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పక్షాన ఏకపక్షం కానున్నాయని ఎర్రబెల్లి ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రె స్ పార్టీకి ఓట్లేసి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందని, స్థ్ధానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సమాయత్తమయ్యారన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు పల్లా సుందరరాంరె డ్డి, తీగల దయాకర్, బస్వ మల్లేశ్, కొల్లూరు సోమ య్య, కత్తుల సోమిరెడ్డి, చింత రవి, జోగు సోమనర్సయ్య, కే భిక్షపతి, కత్తుల విజయ్‌కుమార్, మేకపోతుల నర్సింహ, వంగ అర్జున్, కోతి ప్రవీణ్, హనుమంతు, కుతాటి నర్సింహులు ఉన్నారు.