ఐనవోలు, మార్చి 24 : బీఆర్ఎస్ సిల్వర్ బూబ్లీ వేడుకల సభను విజయవంతం చేయాలని మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం ఐనవోలు మండలం పంథిని గ్రామంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి, ఐనవోలు, వర్ధన్నపేట మండల ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి ఎర్రబెల్లి హాజరయ్యారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తపై ఉందని, సుమారు మూడు మండల నుంచి 20 వేలకు పైగా జనం తరలాలని ఆయన పిలుపునిచ్చారు.
మరో 24 గంటల్లో దేవన్నపేట పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేసి దేవాదుల నీరు వదలకపోతే రైతుల పక్షాన నిలిచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేసేందుకు కార్యాచరణ చేపడుతామని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా పాలకుర్తి, జనగామ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల రైతు సంక్షేమా న్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ పాలనలో రూ.1400 కోట్లు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసి పూర్తి చేశామన్నారు. 14నెలల కింద అప్పటి ప్రభుత్వమే పంప్‌హౌస్‌ను ప్రారంభించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ మూలం గా వాయిదాపడిందన్నా రు.
పూర్తిస్థ్ధాయిలో అందుబాటులోని వచ్చిన ఈ పంప్‌హౌస్‌ను కేవలం పాలకులకు అవగాహన, ఆలోచన లేకనే నీరందించడం లేదని, ఫలితంగా ఆయకట్టు రైతులు లక్షల ఎకరాల్లో యాసం గి పంట నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో పంటలు ఎండిపోలేదని రేవంత్‌రెడ్డి వచ్చాక మార్పు చూపిస్తున్నాడని రై తులే అంటున్నారని చెప్పారు. ఇప్పటికే సగం కంటే ఎక్కువగా పంటలు ఎండిపోయాయని మిగిలిన పంటలకైనా నీళ్లిచ్చి కాపాడాలన్నారు.
దేవాదుల నీరు వదలాలని బీఆర్ఎస్ నెల రోజలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నదని ఎండిన అన్ని పంటలకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించేవరకూ వదిలేది లేదని స్పష్టంచేశారు. సన్నాహక సమావేశంలో పర్వతగిరి సొసైటీ చైర్మన్ మనోజ్‌గౌడ్, నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, మాజీ ఎంపీపీ అప్పారావు, మాజీ జడ్పీ కో ఆప్షన్ ఉస్మాన్ అలీ, మాజీ వైస్ ఎంపీపీ మోహన్, మాజీ జడ్పీటీసీ భిక్షపతి, కుమారస్వామి, రాజేశ్వర్‌రావు, నాయకులు కుమార్, అశోక్, సతీశ్, గుంషావళి, రాజు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.