వానకొండయ్య గుట్టపై మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలి
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని వానకొండయ్య గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మైనింగ్ పనులు అడ్డుకున్న నేపధ్యంలో జారీ అయిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు బుధవారం బీఆర్ఎస్ దేవరుప్పుల మండల ప్రతినిధి బృందంతో కలిసి జనగామ కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను కలిశారు.
- మాజీ మంత్రి ఎర్రబెల్లి డిమాండ్
- జనగామ జిల్లా కలెక్టర్‌ను కలిసి నోటీసులకు సమాధానం చెప్పిన దయాకర్‌రావు
- విచారణకు హాజరైన సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు
జనగామ, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని వానకొండయ్య గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మైనింగ్ పనులు అడ్డుకున్న నేపధ్యంలో జారీ అయిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు బుధవారం బీఆర్ఎస్ దేవరుప్పుల మండల ప్రతినిధి బృందంతో కలిసి జనగామ కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జరగకుండా చూడాలని కోరా రు.
దేవరుప్పుల మండలం లకావత్‌తండా గ్రామ పంచాయతీ పరిధి వానకొండయ్య గుట్టపై లక్ష్మీనరసింహాస్వామి కొలువై ఉన్నాడన్నారు. మైనింగ్ మాఫియాతో ఆలయం ఉనికి కోల్పోతున్నదని కలెక్టర్‌కు ఫొటో లు, ఆధారాలతో సహా వివరించారు. గుట్ట వద్ద మైనింగ్ పనులు జరిగితే దేవాలయం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవస్థానం మనుగడను కాపాడేందుకు మైనింగ్ పనులను నిలిపివేసి రూ.2 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని ఎర్రబెల్లి గుర్తు చేశారు. రాష్ట్రంలోని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ మైనింగ్ చేపట్టారని ఆయన మండిపడ్డారు. మైనింగ్ కోసం ఆన్లైన్లో పర్మిషన్ తెచ్చుకుంటే గ్రామసభ తీర్మానం లేదని, దేవుడి గుట్ట ఉనికి దెబ్బ తింటుందని ఆపింది తామేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మైనింగ్ పనులను అడ్డుకోవడానికి గుట్ట వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి నోటీసులు పంపించి ఇ బ్బందులకు గురిచేస్తున్నారని ఎర్రబెల్లి వివరించారు. అయితే నోటీసులపై జిల్లా కలెక్టర్ సంబంధిత కాం ట్రాక్టర్, మైనింగ్ శాఖ అధికారులను సైతం విచారించగా గ్రామ పంచాయతీ తీర్మానం లేదని తెలిపారన్నా రు. వానకొండయ్య గుట్టపై మైనింగ్ ఆపకుంటే బీఆర్ఎస్ ఆధ్యర్యంలో ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. మరోవైపు పాలకుర్తి నియోజకవర్గంంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

