వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నగరంలోని వేయిస్తంభాల గుడి, కాశీ విశ్వేశ్వరాలయం ఆవరణ, చిన్నపడ్డేపల్లి చెరువులో ఉత్సవాలు హోరెత్తాయి. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో వేడుకలు కనులపండువను తలపించాయి. అన్ని గ్రామాల్లో ఉదయం నుంచే సందడి నెలకొనగా సాయంత్రం పూట ఊర్లన్నీ బతుకమ్మ ఆటపాటలతో మార్మోగాయి. రాయపర్తి మండలం కొండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. వరంగల్ పశ్చిమలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తూర్పులో ఎమ్మెల్యే నన్నపునేనిన నరేందర్ బతుకమ్మ ఆడి స్థానిల్లో ఉత్సాహం నింపారు. తొలిరోజు ఉత్సవాలు ఘనంగా జరుగగా ఇక సద్దుల దాకా అంబరాన్నంటనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. హనుమకొండ వేయిస్తంభాల గుడిలో ఉత్సవాలు హోరెత్తాయి. వరంగల్‌లోని చిన్న వడ్డేపల్లి చెరువు, నర్సంపేట, మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం, జనగామలోని బతుకమ్మకుంట, ములుగు, భూపాలపల్లి జిల్లాకేంద్రాల్లో వేడుకలు కనులపండువను తలపించాయి. పలుచోట్ల ప్రజాప్రతినిధులు బతుకమ్మ ఆడి స్థానికుల్లో ఉత్సాహం నింపారు. అన్ని గ్రామాల్లో ఉదయం నుంచే సందడి నెలకొనగా సాయంత్రం పూట ఊళ్లన్నీ బతుకమ్మ ఆటపాటలతో మార్మోగాయి. రాయపర్తి మండలం కొండూరు, కొలన్‌పల్లి, పాలకుర్తి మండలం దర్దేపల్లి, దేవరుప్పుల మండలకేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. తొలిరోజు ఉత్సవాలు ఘనంగా జరుగగా ఇక సద్దుల దాకా అంబరాన్నంటనున్నాయి.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 14