హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 22: స్థానిక యువతకు ఉపాధి కల్పనకు, వారిలో నైపుణ్యాల అభివృద్ధికి టాస్ సంస్థ కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస ర్ అన్నారు. హనుమకొండ బస్టాండ్ సమీపం లోని భద్రుక డిగ్రీ కళాశాల ఆవరణలో టాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్యాల యాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ యువత, విద్యార్థులు ఉపాధి పొందేందుకు కావాల్సిన నైపు ణ్యాలను టాస్ ఆధ్వర్యంలో అందజేయనున్న ట్లు చెప్పారు.
జిల్లాలో ఐటీ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్‌ని కలిశామని, ఎన్ఐటీ సమీపం లో రెండు ఎకరాల్లో ఐటీ టవర్స్ ఏర్పాటునకు ఆయన సుముఖత వ్యక్తం చేశారన్నారు. ఇప్పటికే టెక్ మహేంద్రా, సాఫ్ట్‌పాత్, జెన్‌పాక్ సంస్థలు వరంగల్‌లో ఐటీ కార్యకలాపాలను ప్రారంభించ గా… వచ్చే నెలలో మైండ్ ట్రీ సంస్థ కూడా ఐటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపా రు. కేంద్రాన్ని నిరుద్యోగులు, ఉద్యోగార్థులు సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్‌యాదవ్ మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి, వృత్తి నైపుణ్య శిక్షణ కోసం టాస్ సెంటర్‌ను వినయ్‌భాస్కర్ హనుమ కొండకు తీసుకొచ్చారని అన్నారు.
ఇప్పటికే రెండు ఐటీ కంపెనీలు జిల్లాలో కార్యాలయాలను ఏర్పా టు చేసేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. టాస్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ జిల్లా కు చెందిన సుమారు వెయ్యిమందికి ఇప్పటికే ఉపాధి అవకాశాలు టాస్ ఆధ్వర్యంలో కల్పించా మన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు ఇప్పటికే హనుమకొండలో టాస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, నూతనంగా మరో ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ఒక నెలలో 200 నుంచి 300 మంది విద్యార్థు లకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఐటీ, నాన్ ఐటీ విభాగాలకు సంబంధించిన శిక్షణతో పాటు నూతన ఆవిషరణలకు ప్రోత్సాహం, సహకారం అందించనున్నామని పేర్కొన్నారు. ఎటువంటి సమాచారం కోసమైనా టాస్ ప్రాంతీయ కేంద్రం 8886016377 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఆర్హెచ్ నెక్స్ట్, సంస్థ ప్రతినిధులు అరవింద్‌కుమార్, టాస్ ప్రతి నిధులు పాల్గొన్నారు.
కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
మడికొండ: కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠ శాలు నడుస్తున్నాయని ప్రభుత్వ ఛీప్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గ్రేటర్ 63 డివిజన్ కాజీపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కుడా మా జీ చైర్మన్‌తో కలిసి ఆయన స్టడీ మెటీరియల్‌ను బుధవారం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోం దని అన్నారు. కార్యక్రమంలో కార్పొటర్ సంకు నర్సింగ్, హెచ్ఎం మామిడాల రాజేందర్ బీఆర్ ఎస్ నాయకులు సదానందం, అశోక్, రమేశ్, రంజిత్‌కుమార్, శివకుమార్, కృష్ణ, వినోద, రామ స్వామి, విజయ్, శేఖర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.