పోచమ్మమైదాన్, అక్టోబర్ 9 : వరంగల్ తహసీల్దార్ ఎం డీ ఇక్బాల్‌పై దాడి ఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవిన్యూ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులు డిమాండ్ చేశారు. తహసీల్దార్‌పై జరిగిన దాడిని జరిగిన దాడిని బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో భాగంగాద వరంగల్ ఎస్ఆర్ నగర్‌లోని బతుకమ్మ ఆట స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లిన అధికారిపై కావాలని అసభ్య పదజాలంతో దూషిస్తూ, దాడి చేయడం సమంజసం కాదని అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ రియాజుద్దీన్, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ జీ రాజ్‌కుమార్, అధ్యక్షుడు ఏవీ భాస్కర్ తెలిపారు.
హనుమకొండ : వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు హనుమకొండ జిల్లా టీఎన్జీవోలు తెలిపారు. బుధవారం యూనియన్ అత్యవసర సమావేశం కలెక్టరేట్లోని టీఎన్జీవోస్ భవన్లో అధ్యక్షుడు ఆకుల రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన తహసీల్దార్‌పై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అధికారులకు రక్షణ క ల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశం లో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, రాష్ట్ర నాయకులు శ్యాంసుందర్, కత్తి రమేశ్, సారంగపాణి, లక్ష్మీప్రసా ద్, సురేశ్, రాజేష్ ఖన్నా, భగవాన్‌రెడ్డి, రాజీవ్, పృథ్వీ,అనూప్, శ్రీనివాస్, మిస్బా, రాజేశ్వర్‌రెడ్డి, ఎర్ర ప్రగడ తదితరులు పాల్గొన్నారు.