నర్సంపేట/చెన్నారావుపేట: పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆర్డీవో పవన్‌కుమార్ ఆవిష్కరించారు. పీఆర్టీయూ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రతి సభ్యుడికి ఈ డైరీని ఉచితంగా అందజేస్తున్నట్లు మండల అధ్యక్షుడు కేతిరి దామోదర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో రత్నమాల, ప్రధాన కార్యదర్శి కోడెం సాంబయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు ఉమామహేశ్వర్, రాష్ట్ర బాధ్యులు మోతె తిరుపతిరెడ్డి, సారంగపాణి, పెండెం భాస్కర్, వీరన్న, శోభన్‌బాబు, జిల్లా బాధ్యులు రమేశ్, శ్యాంప్రసాద్, వీరన్న, విజేందర్‌రావు, రమాదేవి, కుమార్‌రెడ్డి, వెంకటరమణ, సీఆర్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని ఎమ్మార్సీ భవనం వద్ద పీఆర్టీయూ టీఎస్ డైరీని ఎంఈవో రత్నమాల, జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్‌రెడ్డి ఆవిష్కరించారు. మండలాధ్యక్షుడు సురేందర్‌గౌడ్, కార్యదర్శి రమే శ్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం రవి, వేణుబాబు, రవిచంద్ర, విజేందర్, అజయ్‌కుమార్‌గౌడ్, మహేందర్, రవి, కృష్ణమోహన్, ఆంజనేయులు, మల్లయ్య, ఈర్యా తదితరులు పాల్గొన్నారు.
టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి
నెక్కొండలోని ఎమ్మార్సీ భవనంలో పీఆర్టీయూ టీఎస్ క్యాలెండర్, డైరీని ఎంఈవో రత్నమాల ఆవిష్కరించారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు మాలోత్ ప్రతాప్‌సింగ్, ప్రధాన కార్యదర్శి కర్ర యాకూబ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతాప్‌సింగ్, యాకూబ్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో నెక్కొండ హైస్కూల్ హెచ్ఎం రంగారావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, రాపోలు యాకయ్య, రాష్ట్ర నాయకులు జీ శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్, బండి విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, జిల్లా కార్యదర్శి మల్సూర్య, మండల కార్యవర్గ సభ్యులు ఐలయ్య, విజయభాస్కర్, భిక్షపతి, ఉపాధ్యాయులు ఈర్య, అశోక్, బాలకుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నల్లబెల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో పీఆర్టీయూ క్యాలెండర్, డైరీని ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్ ఆవిష్కరించారు. ఎంపీడీవో విజయ్‌కుమార్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు నకిరెడ్డి మహేందర్‌రెడ్డి, కార్యదర్శి ఉడుత రాజేందర్, హరిపతి, శ్రీనివాస్, భిక్షపతి, అచ్చయ్య, సుధాకర్, రామచంద్రు, భాస్కర్, సుభాష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.