హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 10 : పొరుగు జిల్లాలో నిర్మించతలపెట్టిన డంపింగ్‌యార్డు మన జి ల్లాలో కలకలం రేపుతున్నది. పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో చెత్త డంపింగ్ అనేది అతిపెద్ద స మస్యగా మారింది. హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరం నుంచి సేకరించే చెత్తను ఎక్కడ వేయాలనే సమస్య కొన్నేళ్లుగా వేధిస్తుండగా, ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. వరంగల్‌తోపాటు కరీంనగర్, నర్సంపేట, ప రకాల, వర్ధన్నపేట, జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల నుంచి సేకరించే చెత్తను ఒకే చోటుకు చేర్చి, విదేశాల్లో మాదిరిగా విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించింది. దీనికి పొరుగు జిల్లా కరీంనగర్‌లోని హుజూరాబాద్ సమీపంలో సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డును నిర్మించాలని నిర్ణయించింది.
హుజూరాబాద్ సమీపంలో నిర్మించే డంపింగ్ యార్డు వల్ల భారీఎత్తున వాయు కాలుష్యం వెదజల్లి లక్షలాదిమంది ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపనుందనే వార్త గుప్పుమనడంతో హుజూరాబాద్ పరిసర ప్రాం తాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిమంది రోడ్లపైకి వచ్చి ఆందోళన బాటపట్టారు. కొంచెంకొంచెంగా మొదలైన డంపింగ్ యార్డు వ్యతిరేక ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అటు ప్రతిపక్షపార్టీలతో పాటు అధికార పక్షనేతలు సైతం ఈ విషయంపై భగ్గుమంటున్నారు. మొదట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మొ దలైన ఈ ఉద్యమంలో బీజేపీతోపాటు ప్రతిపాదనలు పంపించిన కాంగ్రెస్ పార్టీ సైతం పాలు పంచుకుంటుంది.
అయితే, ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో బీఆర్ఎస్ పార్టీ ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. అయితే, గాలివ్యాప్తి చెందే దూరాన్ని చూసినట్లయితే ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లోని గ్రామాలు కూడా ప్రభావితమయ్యే అవకాశాలుండడంతో అక్కడ కూడా ఆం దోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పొరుగు జిల్లాలో జరుగుతున్న ఈ ఉద్యమంలో నిత్యం ధర్నా లు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్కడి మ్మె ల్యే పాడి కౌశిక్‌రెడ్డి కలెక్టర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సైతం వినతిపత్రాలను అందజేశా రు. ఇలాంటి ప్రాజెక్ట్ జనావాసాల మధ్య కాకుండా నిర్జన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లక్షలాది మంది జీవించే ప్రాంతంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం సరికాదు. ఇక్కడ లక్షలాది ఎకరాల్లో రైతులు విలువైన పంటను పండించి దేశానికి అన్నం పెడుతున్నారు. అనేక దేశాలకు సరఫరా అయ్యే ధాన్యం ఉత్పత్తి ఇక్కడనే జరుగుతున్నది. ఇలాంటి ప్రదేశంపై విషం చిమ్మినట్లుగా ప్రవర్తించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరికాదు. వెంటనే ఇక్కడ చెత్త డంపింగ్ యార్డు పనులను నిలిపివేసి, జనసంచారం లేని ప్రాంతాల్లో నిర్మిస్తే బాగుంటుంది.
– పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే హుజూరాబాద్