వరంగల్, జనవరి 19 : నగరంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తలో పొడి చెత్తను విధిగా డీఆర్సీలకు తరలించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. గురువారం ఆమె 11వ డివిజన్లోని పోతన మినీ డంపింగ్ యార్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. డంపింగ్ యార్డులో స్వచ్ఛ ఆటోల ట్రిప్పుల లాగ్ బుక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ ఇన్చార్జి, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఎంహెచ్‌వోను మేయర్ ఆదేశించారు.
వాహన ట్రాకింగ్ నిర్వహణ సరిగా లేదని, తడి, పొడి చెత్తల వేరు చేసే ప్రక్రియ క్షేత్రస్థాయిలో జరగాలన్నారు. స్వచ్ఛ ఆటోలు చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడంతో పాటు పొడి చెత్తను విధిగా డీఆర్సీలకు అందజేయాలని సూచించారు. స్వచ్ఛ ఆటోలు సమయపాలన పాటించాలన్నారు. ప్లాస్టిక్ నియంత్రణలో కీలక భూమిక పోషించాలని మేయర్ కోరారు.