ఉత్త చెత్తే కదా అనుకోకండి. చెత్త కూడా కాసులు కురిపిస్తున్నది. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి కూడా ఏటా కోట్లలో ఆదాయం సంపాదించవచ్చని నిరూపిస్తున్నది తెలంగాణ మున్సిపల్ శాఖ.
నగరంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తలో పొడి చెత్తను విధిగా డీఆర్సీలకు తరలించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. గురువారం ఆమె 11వ డివిజన్లోని పోతన మినీ డంపింగ్ యార్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు