ఎన్నికల ముందు చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని ఆటోడ్రైవర్లు డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్‌లో పలుచోట్ల శనివారం ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఆటోలు బంద్ చేపట్టి రహదారులపై ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. రేవంత్ సర్కారు ఫ్రీ బస్సు తెచ్చి తమ బతుకులను ఆగం చేసిందని.. గిరాకీలు లేక కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే చిట్టీలు, ఫైనాన్స్‌లు కట్టలేక 60మంది ఆత్మహత్య చేసుకున్నారని.. ఇప్పటికై నెలకు రూ.15వేలు ఇవ్వడంతో పాటు ఆటోడ్రైవర్ల కోసం రూ.1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని, చనిపోయిన డ్రైవర్ల కోసం వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.
మహబూబాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగయ్యే చపాట మిర్చికి అరుదైన ఘనత దక్కింది. దీని జియో గుర్తింపునకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్(ఐపీఓ) ఆమోదం తెలిపింది. ఈ రకం మిరపకాయలు టమాటాలా ఉంటాయి. ఇందులో కారం తకువ మోతాదులో ఉంటుంది. ఈ రకం మిర్చికి గతంలో లక్ష వరకు ధర పలికిన సందర్భాలున్నాయి. చపాట మిర్చికి గతంలో భౌగోళిక గుర్తింపు కోసం కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఎంతో కృషి చేసింది. మారెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల జీవీఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త కే భాసర్ ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. చపాట మిర్చికి ప్రత్యేక గుర్తింపు రావడంతో జాతీయ, అంతర్జాతీయ మారెట్లో మంచి ధరలు లభించే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 7 : అంతర్జాతీయ సిట్టింగ్ పారా త్రోబాల్ పోటీల్లో స్టేషన్ ఘన్పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన మాచర్ల కృష్ణవేణి స్వర్ణపతకంతో మెరిసింది. పుట్టుకతో దివ్యాంగురాలైన కృష్ణవేణి కృషి, పట్టుదలతో త్రోబాల్ పోటీల్లో తన ప్రతిభ చాటుతూ వచ్చింది. ఈ నెల 2 నుంచి 5 వరకు కాంబోడియాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటి గోల్ట్మెడల్ కైవసం చేసుకుంది. దాతల సహకారంతో పోటీల్లో పాల్గొని విజయం సాధించి మండలానికి గుర్తింపు తీసుకొచ్చిందని క్రీడాభిమానులు అభినందించారు.