సాహితీ ప్రముఖులకు ఘన సత్కారం
హనుమకొండ లో నిర్వహిస్తున్న సహృద య సాహిత్య సాంస్కృ తిక సంస్థ, వరంగల్ రజతోత్సవ వేడుకల్లో భా గంగా గురువారం సాహితీ ప్రముఖలను ఘనం గా సత్కరించారు.
- సహృదయ సాహితీ సంస్థ రజతోత్సవాల్లో నాటక ప్రదర్శనలు
పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 16: హనుమకొండ లో నిర్వహిస్తున్న సహృద య సాహిత్య సాంస్కృ తిక సంస్థ, వరంగల్ రజతోత్సవ వేడుకల్లో భా గంగా గురువారం సాహితీ ప్రముఖలను ఘనం గా సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్య క్షుడు గన్నమరాజు గిరిజా మనోహర్రాబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఎస్వీ రామారావు మాట్లాడారు. పద్యం, వచన కవిత, కథ, నవల ప్రక్రియల కంటే సాహితీ విమర్శ విశి ష్టమైనదని అన్నారు. కవులు కప్పి చెప్పితే విమ ర్శకులు విప్పి చెబుతారన్నారు. కవి, రచయిత అంతరంగాన్ని సాహితీ విమర్శ ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు. ప్రముఖ సాహితీవేత్త రేవూరి అనంత పద్మనాభరావు ఆనందం కందళి గ్రంథం గురించి ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఆనంద కందళి గ్రంథకర్త డాక్టర్ బూదాటి వెంకటేశ్వర్లకు సహృదయ పురస్కారాన్ని అందజేశారు. అలాగే విశిష్ట సాహితీ సత్కారాలను డాక్టర్ దహగం సాంబమూర్తి, కంది శంకరయ్యకు అందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్వీఎన్ చారి, కుందా వఝుల కృష్ణమూర్తి, వనం లక్ష్మీకాంతా రావు, లక్ష్మణ్‌రావు, కళా రాజేశ్వ ర్రావు, ఉష, అరుణ, మల్యా ల మనోహర్‌రావు, భాస్కర్‌రావు, డాక్టర్ కేఎల్వీ ప్రసాదరావు, ఆచార్య బన్న ఐలయ్య పాల్గొన్నారు.
ఆలోచింపచేస్తున్న నాటికలు, నాటకాలు…
నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో ప్రదర్శిస్తున్న నాటికలు, నాటకాలను పలువురిని ఆలోచింపజేస్తున్నాయి. కార్యక్రమంలో న్యాలకొండ భాస్కర్ రా వు, అనిల్‌కుమార్, మనోహర్, న్యాయ వాదులు సదాశివుడు, ఏరుకొండ జయ శంక ర్, రత్నాకర్‌రావు, రవీందర్ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ’ఉన్నది ఒకటే జీవితం’ నాటిక అందరినీ ఆకట్టుకుంది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

