పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 23: కావ్యాల్లో నాటక రంగం గొప్పదని, అందుకే కార్యేషు నాటకం రమ్యమని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కళాకారులు, సాహితీవేత్తలపై ఉందని ప్రముఖ సినీ, బుల్లితెర నటుడు సుబ్బరాయ శర్మ అన్నారు. సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర చలనచిత్ర డెవలప్మెంట్ కార్పొరేష న్ లిమిటెడ్ సౌజన్యంతో తెలుగు భాషా ఆహ్వాన నాటక పోటీలను ఆదివారం రాత్రి హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహర బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ఆనాటి నాటిక ప్రదర్శనలో విజ్ఞానం, వినోదంతో పాటు జీవన విధానం, మార్చుకోవాల్సిన తీరు వివరించే వారన్నారు. పాతికేళ్లుగా సాంస్కృతిక నాటకోత్సవాలను నిర్వహిస్తున్న సహృదయ సంస్థ నిర్వాహకులను అభినందించారు. అలాగే బీఎంరెడ్డి కళాక్షేత్రాన్ని సాంస్కృతిక సంస్థలకు ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద కళాకారుల ప్రతిభను వెలికి తీయవచ్చన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కుందావఝ్ఝుల కృష్ణమూర్తి, కార్యదర్శి వనం లక్ష్మీకాంతారావు, ప్రాయోజకులు పాలా యి శరత్ కల్యాణ్, సంతోష్‌కుమార్, సభ్యులు న్యాలకొండ భాస్కర్‌రావు, ఎన్వీఎన్ చారి, బీ పురుషోత్తమరావు, కళా రాజేశ్వర్‌రావు, సీతావెంకటేశ్వర్లు, జూలూరు నాగ రాజు, ఆకుల సదా నందం, ఓడపల్లి చక్రపాణి, మాడిశెట్టి రమేశ్, కవులు, కళాకారులు, నాటక అభిమానులు పాల్గొన్నారు.