జఫర్‌గఢ్, జనవరి 24 : ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని రైతన్నలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ అమలుచేయకుండా అన్యాయం చేస్తూ రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి అయ్యారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జఫర్‌గఢ్ మండలకేంద్రంలో శుక్రవారం రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. అనంతరం గాంధీ సెంటర్లో రాజయ్య మా ట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్ర భుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
రుణమా ఫీ, వరి ధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా రూ. 15 వేలు, కౌలు రైతులకు భరోసా తదితర హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు అట్టర్ ప్లాప్ అయిందని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని గ్రామసభలు నిర్వహించారని, కానీ ప్రజలు చైతన్యవంతులై గ్రామ గ్రామాన నిలదీయంతో సభలన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు. రైతులకు, ప్రజల కు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అధికార దాహంతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీఆర్ఎస్ గుర్తుతో గెలిచి, అధికారం కోసం కాంగ్రెస్‌లో చేరిన శ్రీహరి ఇప్పటికైనా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలవాలని సవాల్ చేశా రు.
ప్రజలకు భయపడి శ్రీహరి గ్రామసభల్లో పాల్గొన లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి తగి న గుణపాఠం చెబుతామని రాజయ్య హెచ్చరించా రు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, కాం గ్రెస్‌కు, ఎమ్మెల్యే శ్రీహరికి ప్రజలే బుద్ధిచెబుతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పసునూరి మహేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు మారపాక రవి, ఆకుల కుమార్, సోమిరెడ్డి, చందర్‌రెడ్డి, కడారి శంకర్, కోత్వాల కుమా ర్, నాయిని నరేశ్, పులి ధనుంజయ్, పెంతల రాజ్ కుమార్, తాటికాయల వరుణ్, యార సోమిరెడ్డి, ఎండీ నజీర్, సింగారపు శ్రీధర్, సుతారి అశోక్, గోలి కవిత, మారపల్లి కర్నాకర్, రాధిక, మాచర్ల శ్రీనివాస్, ఆకారపు యాకయ్య, మంద రాజయ్య, యాదగిరి, మేర్గు రమేశ్, గబ్బెట కొమురయ్య పాల్గొన్నారు.