న్యూ శాయంపేట, మే 6: సమాజంలో ప్రతి ఒక్కరూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రముఖ చాతి వైద్య నిపుణులు డాక్టర్ పూర్ణచంద్ రెడ్డి అన్నారు. ప్రపంచ అస్తమా దినోత్సవాన్ని పురస్కరిం చుకొని మంగళవారం మెడికవర్ దవాఖాన వరంగల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పూర్ణచంద్ రెడ్డి మాట్లాడుతూ మానవునిలో ఊపిరితిత్తుల ఆరోగ్యం ఎంతో కీలకం అన్నారు.
పొగతాగే అలవాట్లను నివారించుకోవాలని సూచించారు. ఆస్తమా నుండి మనల్ని మనం కాపాడు కోవడానికి శుభ్రమైన వాతావరణం, సరైన ఆహారం, వ్యాయామం అవసరమని ఆయన తెలిపారు. ప్రజల్లో ఊపిరితిత్తుల ఆరోగ్యం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సునీల్, డాక్టర్ అరుణ్, సెంటర్ హెడ్ నమ్రత, మార్కెటింగ్ హెడ్ హరినాథ్ గుప్తా, మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, దవాఖాన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.