హనుమకొండ చౌరస్తా, జూన్ 13: జాతీయ శస్త్రచికిత్సల దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని ఆశోకా కన్వెన్షన్ హాల్లో ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు, ఏఎస్ఐ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ డాక్టర్ కూరపాటి రమేష్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యరంగంలో శస్త్రచికిత్సకుల పాత్ర ఎంతో కీలకమైందని, వారి సేవలను సమాజం గుర్తించి కృతజ్ఞతగా నిలవాలని పిలుపునిచ్చారు. టీఎస్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మోహనదాస్ మాట్లాడుతూ వరంగల్‌లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని అభినందించారు.
ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని సంకల్పించారు. స్టేట్ సెక్రటరీ డాక్టర్ ఉమాకాంత్‌గౌడ్ మాట్లాడుతూ ప్రజలు సర్జన్స్ సేవలను గుర్తించి మరింత మెరుగైన సేవలు అందించడానికి వైద్యులకి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ నాగేందర్, డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ శారద వైద్యులు, కేఎంసీ వైద్య స్టూడెంట్స్ పాల్గొన్నారు.