కాశీబుగ్గ, జూలై 31: వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ అనసూయ బదిలీపై వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బదిలీల్లో భాగంగా హైదరాబాద్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ అనసూయను ఇక్కడకు బదిలీ చేశారు.
అలాగే, ప్రసూతి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సులోచన, ప్రొఫెసర్లు రవీందర్‌గౌడ్, శైలేష్నాథ్ సక్సేనా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా సంధ్యారాణి, శ్రీకాంత్, వెంకటరమణ, ఏ శ్రీధర్ హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వచ్చారు. వరంగల్ నుంచి ప్రొఫెసర్లు సులోచన, నాగలక్ష్మి, విజయగణేశ్రెడ్డి, ఏ శ్రీధర్, బాబురావు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు.