ఖిలా వరంగల్ : విమానాశ్రయ విస్తరణకై సేకరించిన ఆ వ్యవసాయ భూముల్లో ఎలాంటి సేద్యం చేయకూడదని వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. మామునూరు విమానాశ్రయ విస్తరణ కోసం వరంగల్ డివిజన్, ఖిలా వరంగల్ మండలంలోని గాడిపల్లి, నక్కలపల్లి గ్రామాల్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూసేకరణ చేపట్టి హద్దులు ఏర్పాటుచేశారు.
220.12 ఎకరాల విస్తీర్ణం కలిగిన పట్టా భూముల సేకరణకు సెక్షన్ 11 (1) ప్రకారం పంపిన ప్రాథమిక ప్రకటన, డిక్లరేషన్ ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ఆమోదించారు. కాబట్టి సంబంధిత రైతులు భూ సేకరణకై ప్రతిపాదించిన ఆ భూములలో ఎలాంటి పంటలు సేద్యం చేయరాదని ఆర్టీవో ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు మాత్రం ఆర్డీవో ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా పంటలు వేయొద్దంటే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.