రాయపర్తి : మండలంలోని మైలారం గ్రామం ఎస్సీ కాలనీలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి(Temple construction) అవసరమైన భూమి కొనుగోలు కోసం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రూ.50 వేలను సోమవారం విరాళంగా అందజేశారు. ఎస్సీ కాలనీకి చెందిన చిర్ర పంగ వంశస్థులు శ్రీనివాస్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయగా తన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సారథ్యంలో ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు లేతాకుల రంగారెడ్డి, రంగు కుమార్, భూక్యా సురేందర్ రాథోడ్ నాయక్, ఎలమంచి శ్రీనివాస్ రెడ్డి, సంది దేవేందర్ రెడ్డి, గజవెల్లి ప్రసాద్, కోల సంపత్, గబ్బెట యాకయ్య, సంకినేని ఎల్లస్వామి, చిర్ర భిక్షపతి, సోమయ్య, యాకయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.