గోవిందరావుపేట, ఏప్రిల్ 4: మండలంలోని చల్వాయి గ్రామ శివారులోని జారుడు బండ అటవీ సమీపంలో నివసిస్తున్న గొత్తికోయలకు వైద్యసేవలు అందించేందుకు వైద్య సిబ్బంది 14 కిలోమీటర్ల మేర అడవుల్లో నడుస్తూ వాగును దాటి మండుటెండలో వెళ్లారు. జిల్లా వైద్యాధికారి అల్లెం అప్ప య్య, ఎంసీహెచ్, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ పవణ్కుమార్ ఆదేశాల మేరకు గొత్తికోయగూడేనికి వెళ్లినట్లు స్థానిక వైద్యాధికారి పోరిక చంద్రకాంత్ తెలిపారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆది వాసీలకు సూచనలు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ జంపయ్య, శ్రీనివాస్, ఏఎన్ఎం రాధిక, ఆశ వర్కర్లు, శ్రీలత, భారతి, వనిత, సరోజ, స్వరూప, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.