వరంగల్ చౌరస్తా: పాదచారులు, రోగుల దాహార్తిని తీర్చడం కోసమే చలివేంద్రాలను ఏర్పాటు చేశామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వరంగల్ విభాగం ఆధ్వర్యంలో ఎంజీఎం దవాఖాన క్యాజువాలిటీ, ఐఎంఏ భవన్ ముందు చలివేంద్రాలను ఎంజీఎం సూపరింటెండెంట్ డా. కె. కిశోర్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్కు వచ్చే రోగులు, వరంగల్ కు వచ్చే ప్రజల దాహార్తి తీర్చడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రటరీ డా.అజిత్ మహ్మద్, ఫైనాన్స్ సెక్రటరీ డా. శిరీష్ కుమార్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా. కాళీప్రసాద్, ,ఇండియన్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ డా. విజయచందర్ రెడ్డి , బిల్డింగ్ కమిటీ చైర్మన్ డా. బందెల మోహన్, ఎంజీఎం ఆర్ ఎం ఓ డా. శశి కుమార్, డా. ప్రసన్న, డా. ప్రతాప్, డా. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.