దుగ్గొండి, ఏప్రిల్ 20: దుగ్గొండి (Duggondi) జడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మురహరి మధుసూదన్ డాక్టరేట్ అందుకున్నారు. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆయన చేసిన సేవలకు గాను ఏషియన్ ఇంటర్నేషనల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ వారు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ నెల 17న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టరేట్‌ను అందుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2023లో ఆయన బహుజన సేవారత్న అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మధుసూదన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామస్వామి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.