వరంగల్, డిసెంబర్ 23: నగరంలో తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను హెచ్చరించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం ఆమె తాగునీటి సరఫరాపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. తాగునీటి సరఫరాలో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. లీకేజీలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చిన పనులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పనులను ఎంబీ రికార్డుల్లో సకాలంలో నమోదు చేయాలన్నారు. పనుల్లో డివియేషన్లు ఉంటే కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి బిల్లు ఎంబీ రికార్డు జరుగాలన్నారు. అ న్ని సర్కిళ్లలో ఒకేవిధానం ఉండాలని సూచించారు. కాం ట్రాక్టర్లు సకాలంలో పనులు చేయని వాటిని రద్దు చే యాలని ఆదేశించారు. రద్దు చేసిన పనులను వెంటనే టెం డర్లు పిలువాలని సూచించారు. క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన ఫైళ్ల నిర్వహణ కచ్చితంగా ఆన్లైన్ ద్వారా జరుగాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్చంద్ర, ఈఈలు రాజయ్య, బీఎల్ శ్రీనివాసరావు, అకౌం ట్ అధికారి సరిత, ఐటీ మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు.