వాజేడు, జూన్ 4: 108 వాహనంలో ప్రసవంపై ములుగు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య సీరియస్ అయ్యారు. ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో మంగళవారం ప్రచురితమైన ‘108లోనే పురుడు.. నిరుపేదకు అందని వైద్యం’ కథనానికి ఆయన స్పందించారు. ఘటనపై బాధ్యులను చేస్తూ వాజేడు, ఏటూరునాగారం సీహెచ్‌సీ, ములుగు దవాఖాన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి నివేదికను కమిషనర్‌కు అందజేయనున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. వాజేడు పీహెచ్‌సీని మంగళవారం ఆయన సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆశా డే రివ్యూ మీటింగ్‌లో పాల్గొని వైద్య సిబ్బందికి పలు సూచనలను చేశారు. గర్భిణులను గ్రామాల వారీగా గుర్తించి పీహెచ్‌సీలు, వైద్యశాలకు తీసుకొచ్చి ప్రసవం చేయించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యాధికారులు మహేందర్, మధుకర్, జ్ఞానాస, సీహెచ్‌వో సూర్యప్రకాశ్, హెల్త్ సూపర్వైజర్స్ కోటిరెడ్డి, వెంకటరమణ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.