బచ్చన్నపేట సెప్టెంబర్ 15 : గ్రామపంచాయతీ రికార్డులన్నీ పకడ్బందీగా నిర్వహించాలని డీఎల్పీవో వెంకటరెడ్డి సూచించారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పైప్ లైన్ లీకేజీ లేకుండా చూడాలన్నారు. పంచాయతీ ట్రాక్టర్ కి చెత్త అందించాలని ఈ విషయం ప్రజల్లో మరింత అవగావహన పెంచాలన్నారు. గ్రామంలోని స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం, నర్సరీలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా జనన, మరణాల నమోదు విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా మెరుగ్గా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బృంగి రూపా చైతన్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.