హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 6 : వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ -19 ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగ ఎంపిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి టిటిడి మేనేజర్ రఘువీర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ జిల్లా స్థాయి నుండి సుమారు 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు.
బాలుర విభాగం నుంచి రిత్విక్ గండు మొదటి స్థానంలో, రెండవ స్థానంలో సాయి జ్యోతి బొల్లం, మూడో స్థానంలో అక్షయ్ కుమార్ వి, నాలుగో స్థానంలో చకిలం చరణ్ రాజ్, బాలికల విభాగంలో మొదటి స్థానంలో తోట జాన్వి, రెండవ స్థానంలో దీపిక బొమ్మిడిని, మూడవ స్థానంలో వర్షిత పటూరి, మూడవ స్థానంలో కైరం కొండ సహస్ర, నాలుగో స్థానంలో నగస్వరం కోమలి ఎంపికయ్యారన్నారు. గెలుపొందిన విజేతలు మంచిర్యాలలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో వరంగల్ జిల్లా తరఫున ప్రాతినిధ్య వహిస్తారని నిర్వహణ కార్యదర్శి కన్న తెలిపారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్ శ్రీనివాస్ సీహెచ్, ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.