నర్సంపేట, ఏప్రిల్ 26 : ఆరోగ్య తెలంగాణ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలో బుధవారం 70 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్వోసీ లేఖలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు వీలుగా ఈ డబ్బులు అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీలో లేనటువంటి జబ్బులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఏ ఆస్పత్రుల్లోనైనా చికిత్స చేయించుకున్నా లబ్ధిదారులు బిల్లులను దరఖాస్తులతో జరపరిచి ఇవ్వాలని అన్నారు. చికిత్సకు ముందే ఆస్పత్రుల్లో అంచనా వేయించి తెస్తే దానికి అయ్యే వైద్య ఖర్చులకు ఎల్వోసీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత లేని ఎంతో మంది పేదలకుసీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతిఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రూ.రెండు కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంక్షేమ నిధికి విరాళాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలశ్రేయస్సే తన బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 8000 మందికి పైగా లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ కింద రూ.60 కోట్లు అందించినట్లు తెలిపారు. ఏం చేసినా కేసీఆర్ రుణం తీర్చుకోలేమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఎంపీపీలు వేములపల్లి ప్రకాశ్‌రావు, ఊడుగుల సునీత తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
నల్లబెల్లి : మండలంలోని 21 మందికి రూ.5.90 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నల్లబెల్లి జడ్పీటీసీ, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న అందజేశారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, నాయకులు గందె శ్రీనివాస్‌గుప్తా, సర్పంచ్ ఊరటి అమరేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోరాట యోధుడు కుమ్రంభీం
నర్సంపేట : ఆదివాసీల ఆరాధ్య ధైవం కుమ్రంభీం అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని పాకాల రోడ్డు సెంటర్లో కొమురం భీం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆదివాసీల పోరాట యోధుడు కుమ్రంభీం అని, వారి హక్కుల కోసం పోరాటం చేశారని అన్నారు. కుమ్రం భీం ఆశయాల సాధనకు కృషి చేయాలని, ఆయన అడుగు జాడల్లో నడువాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, ఈసం స్వామి, పొదెం రాణి, వాసం కుమారస్వామి పాల్గొన్నారు.