కేసముద్రం : ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల సౌకర్యార్థం మిడ్ వెస్ట్ క్వారీ ఆధ్వర్యంలో రూ.10 లక్షల విలువగల బెంచీలు, సైకిల్లు, కంప్యూటర్లు అందించినట్లు క్వారీ మేనేజర్ వినయేందర్ రెడ్డి తెలిపారు. మండలంలోని అర్పనపల్లి గ్రామంలో ఉన్న మిడ్ వెస్టు క్వారీ ఆధ్వర్యంలో మంగళవారం కల్వల హైస్కూల్‌కు 38 సైకిల్లు, 2 కంప్యూటర్లు, కేసముద్రం స్టేషన్ హైస్కూల్‌కు 72 సైకిల్లు, 2 కంప్యూటర్లు, వెంకటగిరి ప్రాథమిక పాఠశాలకు 15 బెంచీలు, 2 కంప్యూటర్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించేందుకు మిడ్ వెస్ట్ క్వారీ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్ వెస్టు క్వారీ ప్రతినిధులు గౌండ్ల మల్లయ్య, రామకృష్ణ ఉన్నారు. మిడ్ వెస్టు క్వారీ ప్రతినిధులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సన్మానించారు.