పోచమ్మమైదాన్, జనవరి5: పుట్టగొడుగుల్లా ప్రభుత్వ అనుమతి లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టుకొస్తున్నా యి. వైద్యాధికారుల అనుమతి లేకుండా ఆఫర్ల పేరిట కొం తమంది ల్యాబ్ టెక్నీషియన్లు ప్రజలను మోసం చేస్తున్నా రు. ఆన్లైన్లో తక్కువ ధరలకు టెస్టులు చేస్తున్నామని ప్రకటనలు ఇస్తూ ఇష్టారీతిన పరీక్షలు చేసి రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటిదే వరంగల్ దేశాయిపేటలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. సీకేఎం కళాశాల మైదానంలో ప్రభుత్వ అనుమతి లేకుం డా కాకతీయ హెల్త్ కేర్ సెంటర్ పేరుతో వైద్య శిబిరం ఏ ర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నాడు.
స్థానికుల ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వీ నరేశ్‌కుమార్ తనిఖీ చేశారు. రిపోర్టులపై ఫాథాలజిస్టు డాక్టర్ సుంకరి నరేశ్‌బాబు, డాక్టర్ ప్రతిమ పేర డిజిటల్ సంతకాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. సదరు డాక్టర్‌ను సంప్రదించగా హెల్త్ కేర్ సెంటర్‌కు, నిర్వాహకుడికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడని నరేశ్‌కుమార్ తెలిపారు. ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన రిపోర్టులు కూడా ఫేక్ అని తేలడంతో వైద్యాధికారులకు ఫిర్యాదు చేశామని, ఇద్దరు డాక్టర్లకు మెడికల్ కౌన్సిల్ నుంచి నోటీసులు ఇవ్వనున్నట్లు వివరించారు.
జనగామ జిల్లాకు చెందిన ముక్క అరుణ్ కుమార్ ల్యాబ్ టెక్నీషియన్ చదివి, ప్రభుత్వ అనుమతి లేకుండా కాకతీయ హెల్త్ కేర్ సెంటర్, జేపీఎన్ రోడ్డు, వరంగల్ పేరు మీద కొన్ని పుస్తకాలు ముద్రించి, తక్కువ ధరలకు ప్రజలకు రక్త పరీక్షలు చేస్తున్నామంటూ శిబిరం నిర్వహిస్తున్నాడు. అయితే ఇందులో పేర్కొన్న అడ్రస్‌లో అసలు ల్యా బ్ కానీ, పరీక్షల పరికరాలు లేవని తేలింది. అలాగే జిల్లా అధికారుల అనుమతి కూడా లేదు. 11 రకాల పరీక్షలకు రూ. 499 అని ప్రజలను మోసం చేస్తున్న నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.