హన్మకొండ రస్తా : చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో కార్తిక శుద్ధ ద్వాదశి సందర్భంగా రుద్రేశ్వరునికి రుద్రాభిషేకాలు( Rudrabhishekam) నిర్వహించారు. కరుణాకర్-దీప్తి దంపతుల సౌజన్యంతో అమరావతి నగరం నుంచి లక్ష శివనామాలతో 21 రకాల పుష్పాలతో ( Flowers ) లక్షపుష్పార్చన నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
అనంతరం నాట్యమండపంలో మండపారాధనచేసి ఉసిరిక , తులసీ వృక్షానికి, మహావిష్ణువు, మహాలక్ష్మీ దేవతలకు ‘ధాత్రి నారాయణస్వామి’ (Dhatrinarayana Swamy ) కల్యాణోత్సవాన్ని వేదపండితులు ఆదిత్యశర్మ, చెరుకుపల్లి శ్రీవాత్సవాచార్యులు నిర్వహించారు. ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగా తులసి చెట్టును లక్ష్మీ స్వరూపంగా కలిపి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి, వారి ఇద్దరి వివాహం జరిపించినట్లు తెలిపారు.
అనంతరం భక్తులకు వనభోజనాలు అందించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ధరణికకోట అనిల్‌కుమార్, ఆలయ సిబ్బంది మధుకర్, సుజాత, రామకృష్ణ, రంజిత్ భక్తులకు సేవలందించారు. కార్తీక ద్వితీయ సోమవారం పురస్కరించుకుని సోమవారం రుద్రేశ్వరస్వామికి లక్ష తులసీదళార్చన, చతుర్వేద పారాయణం దేవాదాయ, ధర్మామదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని , మహిళాభక్తులకు దీపపు ప్రమిదలు, వత్తులు, నువ్వులనూనె ఉచితంగా ఇవ్వనున్నట్లు ఈవో తెలిపారు.