కాజీపేట, ఆగస్టు 24: దసరా, దీపావళి, ఛాత్ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని రైల్వేశాఖ కాజీపేట జంక్షన్ మీదు గా పలు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. సంట్రగంజీ- చర్లపల్లి, చర్లపల్లి- సంట్రగంజీ రైల్వే స్టేషన్ల మధ్య సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సర్వీసులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
సంట్రగంజీ- చర్లపల్లి మధ్య రైలు నంబర్ 08845 నంబర్‌తో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రతి శుక్రవారం, చర్లపల్లి- సంట్రగంజీ మధ్య రైలు నంబర్ 08846 నంబర్‌తో సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వర కు ప్రతి శనివారం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వివరించారు. ఇవి ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రాక్, కటక్, భువనేశ్వర్, కుర్ధా రోడ్డు, బరంపూర్, విజయనగరం, సింహాచలం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఆగుతాయని పేర్కొనారు. ఈ రైలుకు 3 ఏసీ కోచ్‌లు మాత్రమే ఉంటాయని, ప్రయాణికులు చేసుకోవాలని కోరారు.