వరంగల్‌చౌరస్తా, నవంబర్ 7: బ్యాంకు ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిజినల్ జనరల్ మేనేజర్ ఘన్‌శ్యామ్ సోలంకి అన్నారు. వరంగల్‌లోని ఐఎంఏ భవనంలో గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రీజినల్ మేనేజర్ విష్ణువర్ధన్ అధ్యక్షతన వినియోగదారులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఖాతాదారులు అకౌంట్ నంబర్లు, పాస్వర్డులు, పిన్ నంబర్లను ఇతరులకు తెలుపొద్దన్నారు. తప్పుడు సమాచారం వల్ల ఖాతాలోని నగదు పోయినా వెంటనే 1930కి డయల్ లేదా WWW.cybercrime.gov.inలో లాగిన్ అయి ఖాతా వివరాలు తెలియజేస్తే చెల్లింపులను నిలిపివేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ పృథ్వీరాజ్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, డీఆర్డీవో రేణుక, నాబార్డ్ ఏజీఎం టీ రవి పాల్గొన్నారు.