భీమదేవరపల్లి/ఐనవోలు, జనవరి 15: కొత్తకొండ వీరభద్రుడి, ఐనవోలు మల్లన్న జాతర్లకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళ, బుధవారాల్లో లక్షలాది మంది హాజరై స్వామి వార్లను దర్శించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చాలని వీరభద్ర స్వామి వారికి కోరమీసాలు సమర్పించారు. తమగండాలు తొలగిపోవాలని గండ దీపంలో నూనె పోశారు. కోడె ప్రదక్షిణలు చేశారు. ఆలయ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్‌గుప్తా, ఈవో కిషన్‌రావు సదుపాయాలు కల్పించారు. వేలేరుకు చెందిన యాదవులు డప్పుచప్పుళ్లు, శివసత్తుల నృత్యాల మధ్య మేకల బండితో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
ఎడ్లబండ్లను బంతిపూలతో వివిధ రంగులతో అందంగా అలంకరించిన రథాలను తిలకించేందుకు ప్రజలు దారి వెంట బారులు తీరారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా స్వామి వారిని దర్శించుకున్నారు. ఐనవోలు మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ దేవతకు భక్తులు బోనాలు చేసి శివసత్తుల పూనకాలతో నైవేద్యం సమర్పించారు. స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకా లు చేసి బిల్వార్చన శివలింగాన్ని అలంకరించారు. బంగారు బీసాలు, వెండి కిరీటం, కవచం సుగంధాలు వెదజల్లే గజ పుష్పమాలతో దేదీప్యమానంగా ముస్తాబు చేశారు.
మార్నేని వంశీయుల ఆధ్వర్యంలో టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు కొబ్బరికాయ కొట్టి పెద్ద రథాన్ని ప్రారంభించగా, పుర వీధుల గుండా ఆలయానికి చేరుకున్నది. ఒంటిమామిడిపల్లి, ముల్కలగూడెం, పెరుమాండ్లగూడెం గ్రామాలను నుంచి కూడా ప్రభ బండ్లు కట్టి స్వామి వారికి మహానివేదనగా సమర్పించారు. మల్లన్నను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, దేవాదాయ శాఖ వరంగల్ ఉప కమిషనర్ సంధ్యారాణి, సహాయ కమిషనర్ రామాల సునీత దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
ఐనవోలు/దేవరుప్పుల: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. మంగళవారం ఆయన స్వామి వారిని దర్శించుకుని మా ట్లాడారు. ఈ ఆలయం అంటే తనకు 50 ఏళ్ల నుంచి చాలా సెంటిమెంటని, ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తానని పేర్కొన్నారు. ప్రతి జాతర కోసం నిధులు కేటాయించి అద్భుతంగా తయారు చేశామన్నా రు. ప్రత్యేకంగా 40 ఏళ్ల నుంచి ఈవో, అధికారులు వచ్చి తనకు ఆహ్వానం ఇచ్చేవారని, కానీ ప్రస్తు తం ఆ పరిస్థితి లేదన్నారు. తనకు గతం నుంచి ఉన్న అనుబంధంతో, కార్యకర్తల పిలుపు మేరకు కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నానని తెలిపారు. పోరాటాలే ఊపిరిగా ప్రత్యేక రాష్ర్టాన్ని తెచ్చి పదేండ్ల పాలనలో బంగారు తెలంగాణగా మార్చిన గులాబీ నేతల శ్రేణుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడానికి సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న చిల్లర చేష్టలను ప్రజలు ఏవగించుకుంటున్నారని ఎర్రబెల్లి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫిరాయింపు రాజకీయాలను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడం చేతకాక, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలు, శ్రేణులను అరెస్ట్ చేయడమే ఏడో గ్యారెంటీ పథకంగా అమలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సమాధానం చెప్పే చేవలేక అణచివేతకు పాల్పడడం అప్రజాస్వామికమన్నారు. పూటకో అక్రమ కేసు, రోజుకో అరెస్ట్ తీరుగా పాలన సాగిస్తు న్న రేవంత్ సర్కారును ప్రజలు ఈసడించుకుంటున్నారన్నా రు. నిత్యం ప్రజలతో ఉండే ఓ ఎమ్మెల్యేను పండుగ పూట అరెస్టు చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఫిరాయింపులను అక్రమమన్న రేవంత్‌రెడ్డి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు ఎలా కప్పారని ఎర్రబెల్లి ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు వెన క్కి తీసుకుని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Warangal