కొడకండ్ల, నవంబర్ 21 : “కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, కటిక చీకట్లు చూసినం.. మళ్లీ అలాంటి రోజులు మనకు రావొద్దు.. ఇందుకు ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలి.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు అప్పటి రోజులనే గుర్తు చేస్తున్నయి.. కాంగ్రెస్‌కు ఓ టు వేస్తే కటిక చీకట్లు, కరెంటు కోతలే మిగులుతాయి.. సీఎం కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చేశా..బీఆర్ఎస్కు ఓటు వేస్తే అభివృద్ధికి బాటలు వేసినట్లే” అని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని రేగుల, ఏడునూతుల, నర్సింగాపురం, రంగాపురం, జీబీ తండా, రామవరం, మొండ్రా యి గ్రామాల్లో జబర్దస్త్ ఆర్టిస్ట్ రాజమౌలి, ఫోక్ సింగర్ కనకవ్వలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు బతుకమ్మలు, బోనాలతో ఎదురేగి ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లోని ప్రచార సభల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎన్నికలు అనగానే ఎవరెవరో వలస పక్షులు వస్తారని, వారి మాటలకు మన భవిష్యత్‌ను పణంగా పెట్టొద్దన్నారు. ఆలోచనతో ఓటు వేయాలని సూచించారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. కరెంటు కష్టాలు తప్పవన్నారు. నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధిని గుర్తించి మరోసారి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొడకండ్ల మండలకేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన ఆలకుంట్ల విజయ్, కుంచం మోహన్, శివరాత్రి సోమయ్య తదితరులు కాంగ్రెస్ నుంచి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్ కుం దూరు వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, ఎంపీ ధరావత్ జ్యోతి, ఏఎంసీ చైర్మన్ పేరం రాము, టీఎస్‌ఈజీసీ సభ్యుడు అందె యాక య్య, జడ్పీటీసీ కేలోత్ సత్తెమ్మ, రైతు బంధు సమితి మండ ల అధ్యక్షుడు దీకొండ వెంకటేశ్వర్రావు, సర్పంచుల ఫో రం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, వైస్ ఎంపీపీ వీరస్వామి, సొసైటీ వైస్‌చైర్మన్ మేటి సోమరాములు, బీఆర్ఎస్ యూ త్ మం డల అధ్యక్షుడు దేశగాని సతీశ్, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు భూక్యా మం గ్యా, సర్పంచులు, పాల్గొన్నారు.