హనుమకొండ, డిసెంబర్ 18: విద్యార్థులు క్రీడల్లో రాణించి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని జిల్లా విద్యాశాఖాధికారి లింగాల వెంకటగిరిరాజ్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-14 బాక్సింగ్ బాలుర టోర్నమెంట్ కం సెలక్షన్స్గురువారం హనుమకొండ ఎస్జిఎఫ్ సెక్రెటరీ వి.ప్రశాంత్‌కుమార్ అధ్యక్షతన హనుమకొండలోని బాక్సింగ్ హాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఈవోతో పాటు, రాష్ర్ట యూత్ కాంగ్రెస్ నాయకుడు డి.విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో వెంకటగిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. క్రీడలతో ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతారని, క్రీడల వలన స్నేహభావం పెంపొందుతుందన్నారు.
ఇక్కడి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచి తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచాల స్వామిచరణ్, బాక్సింగ్ కన్వీనర్, టీజీ పేట అధ్యక్షుడు ఎస్.పార్థసారథి, భూపాలపల్లి డీవైఎస్వో సిహెచ్.రఘు, పుట్ట మోహన్ రెడ్డి, టిజిపేట హనుమకొండ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, ఎక్స్ ఆర్మీ కోచ్ ఎస్.నరేంద్రదేవ్, ఆర్.సుభాష్, సీనియర్ బాక్సర్స్ ప్రభాకర్, చేరాలు, కుమార్, సామ్సన్, శ్రీకాంత్, రాజు పాల్గొన్నారు.