బచ్చన్నపేట, జులై 7 : చదువుకున్న బడిపట్ల మమకారంతో విరాళాలు ఇవ్వడం హర్షనీయమని జనగామ జిల్లా డీఈవో భోజన్న అన్నారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానో ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో పూర్వ విద్యార్థి హరిచరణ్ రాజు తన తండ్రి రాఘవ రాజు జ్ఞాపకార్ధం రూ. 2 :50 లక్షలతో నిర్మించిన స్టేజీని డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని దాతలు గుడులకు ఇచ్చిన విధంగా విరాళాలు బడులకు ఇవ్వడం లేదన్నారు.
చదువు నేర్పిన బడి కోసం పూర్వ విద్యార్థులు విరాళాలు అందించాలన్నారు. హరిచరణ్ రాజు గతంలో గతంలో వాటర్ ట్యాంకుకు 40 వేలు, సైన్సు ల్యాబ్ కు 50 వేలు, స్టేజీ నిర్మాణానికి రెండున్నర లక్షలు విరాళంగా అందించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, దాత హరిచరణ్ రాజు, పాఠశాల ఉపాధ్యాయులు పృథ్వీరాజ్, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, నిర్మల, జీవనకుమారి, పద్మజ, విజయలక్ష్మి, పూర్వ విద్యార్థులు యాదగిరి, మురళి పాల్గొన్నారు.