వెంకటాపురం(నూగూరు), జనవరి 20 : పాలెం వాగు ప్రాజెక్టు నుంచి సా గునీరు సరఫరా చేయాలని రైతులు రోడ్డెక్కారు. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని చిరుతపల్లి ప్రధాన రహదారిపై బర్లగూ డెం సర్పంచ్ కొర్స నర్సింహమూర్తి, ఆదివాసీ నవ నిర్మాణ సేన(ఏఎన్ఎస్) రాష్ట్ర నాయకులు వాసం నాగరాజు ఆధ్వర్యం లో శనివారం ఆదివాసీ రైతులు రాస్తారోకో నిర్వహించి, రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సింహమూర్తి, నాగరాజు మా ట్లాడు తూ ఆదివాసీ రైతులకు సాగునీరు ఇవ్వకుండా అధికారులు నిర్లక్షం చేస్తున్నారన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు నీళ్లు రైతులకు ఉపయోగ పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజె క్టు కెనాల్‌కు అధికారులు మరమ్మతులు చేయ క పోవడం వల్ల గిరిజన రైతుల కు సాగునీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలెం వాగు ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న అధికారులు ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. నిరసన తెలిపిన వారిలో అట్టం సత్యం, ఇర్పబాబు, బర్లగూడెం మాజీ సర్పంచ్ మిచ్చా వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.