తొర్రూరు, జూలై 29 : పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి తీరును వ్యతిరేకిస్తూ అసమ్మతి నేతలు మంగళవారం సమావేశమయ్యారు. తొ ర్రూరు మారెట్ కమిటీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఒకచోట కలుసుకున్న వారంతా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ న్, సీఎం రేవంత్‌రెడ్డిని రెండు రోజుల్లో కలిసి ఝాన్సీరెడ్డిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా గే స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాలనే అవగాహనకు వచ్చారు. ఝాన్సీరెడ్డి నాయకత్వం లో ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా దక్కవనే నిర్ణయానికి వచ్చారు.
కొత్తగా పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేయడం, ఏళ్లుగా పార్టీకోసం కష్టపడిన సీనియర్ నా యకులు, కార్యకర్తలను పక్కనపెట్టడంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ముఖ్య నాయకులు నిరంజన్‌రెడ్డి, హనుమాండ్ల నరేందర్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, మెరుగు మల్లేశంగౌడ్, బాలునాయక్, చిట్టిమల్ల మహేశ్, దేవరకొండ శ్రీనివాస్, అన్వేశ్గౌడ్, సట్ల చంటి పాల్గొన్నారు.
మీనాక్షిని కలిసిన ఝాన్సీరెడ్డి
పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ను మంగళవారం కలిశారు. అసమ్మతి నేతలను పార్టీ నుంచి బహిష్కరించేందుకు వారితో చర్చించినట్లు స మాచారం. అలాగే పార్టీ తొర్రూరు మండలాధ్యక్షుడిని సైతం మార్చేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. అసమ్మతి నేతలు సమావేశం కావడం, తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన విషయాన్ని తె లుసుకున్న ఝాన్సీరెడ్డి ముందుగానే మీనాక్షి, మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతున్నది.