హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 18 : కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమని, ప్రజాసంక్షేమం, అభివృద్ధి రెండు జోడెడ్ల వలె సాగాయన్నారు. తెలంగాణలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమయ్యాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ అన్నారు. శుక్రవారం 9వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, 10వ డివిజన్ అధ్యక్షుడు పులి రజినీకాంత్ ఆధ్వర్యం లో మచిలీబజార్, రాగన్నదర్వాజ, చౌరస్తాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ 16 నెల ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ప్రజలు మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరిందని రానున్న రోజుల్లో ఎగరబోయేది గులాబీ జెండాయేనని ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్, గులాబీ సైన్యమని చెప్పారు.
ఏప్రిల్ 27న ఎల తుర్తి మహాసభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హనుమకొండ చౌరస్తాలోని వ్యాపార సముదాయా లు, ప్రజలకు సభ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్ రోడ్డు హనుమాన్ గుడి వద్ద బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. డప్పు కళాకారుల మోతల నడుమ గులాబీ శ్రేణులు, మహిళలు తరలివచ్చి సభ ను విజయవంతం చేయాలని ప్రచారం చేశారు.