మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 6 : హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఇన్చార్జి దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లో మాజీ ఎంపీ కవితతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. మానుకోట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగుర వేయాలన్నారు. హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల న్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఇంకా కనబడుతుందని, రెండేళ్ల యినా ఒక్క కాలనీని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మరిచి పోయాడని, రెండేళ్లవుతు న్నా ఎక్కడా ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో ఏ రోడ్డు చూసినా గుంతలమయమై ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. శివారు కాలనీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జంగాల రాధిక విజయ్, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.