హనుమకొండ, జూన్ 21 : ‘స్వరాష్ట్ర సాధనోద్యమానికి దిక్సూచీ.. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడిన యోధుడు.. జాతిని జాగృతం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్’ అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. జయశంకర్ సార్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సర్ స్మృతి వనం (ఏకశిలా పారు)లోని జయశంకర్ సర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సర్ చూపిన బాటలో పయనిస్తామన్నారు. తెలంగాణే శ్వాస, ధ్యాసగా జీవించిన మహనీయుడు జయశంకర్ సార్ అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కేసీఆర్‌కు స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అండగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకశిలా పారును ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనంగా మార్చినట్లు దాస్యం పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, ముద్దసాని సహోదర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ గణేశ్, వీరేందర్, నయీముద్దీన్, బొందు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : ఏకశిలా పారు ఆక్రమణకు గురికాకుండా చూడాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 14వ వర్ధంతిని పురసరించుకొని శనివారం ఏకశిలా పారులోని ఆయన విగ్రహానికి బల్దియా కమిషనర్ చాహ త్ బాజ్‌పాయ్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా స్థానిక వాకర్ అసోసియేషన్ సభ్యులు పారులో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. పారులో ఉత్తరం వైపు ఉన్న ఖాళీ స్థలంలో గ్రం థాలయం కోసం హామీ ఇచ్చారని, దానిని ఏర్పాటు చేయ ని క్రమంలో ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని, తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పారులో గ్రీనరీ బాగుందని, పూల మొకలు కూడా నాటాలని ఈ సందర్భంగా కమిషనర్‌కు బండా ప్రకాశ్ సూచించారు.