వెంకటాపురం (నూగూరు), జూలై 18 : మహితాపురం గ్రామ సమీపంలోని గడి చెరువు జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ప్రకృతి ఒడిలో ఉన్న జలపాతం జల కళను సంతరించుకోవడంతో గురువారం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం,
నల్లగొండతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. గుట్టలపై నుంచి నీరు జాలువారుతుండడాన్ని చూసి పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. జలపాతం నీటిలో జలకాలాడుతూ సరదాగా గడిపారు.